కదిరిలో ఎమ్మెల్యే కందికుంట ప్రజా దర్బార్
సత్యసాయి: కదిరి పట్టణం నిజాం వలి కాలనీలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఎమ్మెల్యే ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ మురళి కృష్ణ, మున్సిపల్ చైర్మన్ దిల్షాద్ పాల్గొన్నారు.