VIDEO: కొండగట్టుకు బయలుదేరిన హనుమాన్ భక్తులు

VIDEO: కొండగట్టుకు బయలుదేరిన హనుమాన్ భక్తులు

MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామానికి చెందిన భక్తులు హనుమాన్ మాలాధారణతో 41 రోజుల దీక్షను పూర్తి చేసి, కొండగట్టు అంజన్న ఆలయానికి పాదయాత్రగా బయలుదేరారు. మంగళవారం హనుమాన్ ఆలయం వద్ద ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించి, అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జైశ్రీరామ్ నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగేలా చేస్తూ తమ యాత్రను ప్రారంభించారు.