పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి: డీఎస్పీ

ప్రకాశం: వేసవి సెలవులు సమీపిస్తున్న నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలని కనిగిరి డీఎస్పీ పీ.సాయి ఈశ్వర్ యశ్వంత్ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సెలవు అని చెప్పి ఈత కోసం బావులు, చెరువులు వద్దకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలా ఉన్నాయని గుర్తు చేశారు. తల్లిదండ్రులు వాళ్ల పిల్లలపై శ్రద్ధ వహించాలని కోరారు.