ఎస్సీ హాస్టల్‌ను సందర్శించిన తహసీల్దార్
సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని GSCDBH (ప్రీ-మెట్రిక్) ఎస్సీ హాస్టల్‌ను కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ కళ్యాణం శ్రీకాంత్ సోమవారం సందర్శించారు. హాస్టల్‌లో సౌకర్యాలు, ఆహార నాణ్యత, పరిశుభ్రత, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని, అవసరమైన మెరుగుదలలపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు.