VIDEO: డయేరియా బాధిత కుటుంబాలను కలిసిన కేంద్ర మంత్రి
శ్రీకాకుళం కండ్ర వీధిలో డయేరియా బాధపడుతున్న వ్యాధిగ్రస్తుల కుటుంబాలను కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కలుసుకున్నారు. గురువారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే గోండు శంకర్రావుతో కలిసి బాధిత ప్రాంతాలను పర్యటించారు. బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ద్వారా అన్ని విధాల ఆదుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.