వైద్య వృత్తి మానవతా సేవకు ప్రతీక: కలెక్టర్
BDK: కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాలలో సోమవారం నూతన వైద్య విద్యార్థులు(MBBS) వైద్య వృత్తిలో అడుగుపెట్టిన సందర్భంగా వైట్ కోట్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య వృత్తి మానవతా సేవకు ప్రతీక, విద్యార్థులు నిబద్ధత, అంకితభావంతో సమాజానికి సేవ చేయాలని సూచించారు.