ముంపు ప్రాంతాలను సందర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
KMM: మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాలను శుక్రవారం BJP రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు సందర్శించారు. 3 టౌన్ కాలనీ, మోతినగర్ ప్రాంతాల్లోని వరద బాధిత కుటుంబాలను పరామర్శించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు పునరావాసం కల్పించి, సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.