సురవరం సుధాకర్ రెడ్డికి సీపీఐ నివాళి

సురవరం సుధాకర్ రెడ్డికి సీపీఐ నివాళి

GNTR: సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి గుంటూరులో కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి మాల్యాద్రి మాట్లాడుతూ.. పేదల కోసం జీవితాంతం పోరాడిన గొప్ప నాయకుడని కొనియాడారు. 2000లో బషీర్‌బాగ్‌ విద్యుత్ ఉద్యమంలో ఆయన పోషించిన కీలక పాత్రను, జైలు జీవితాన్ని గుర్తుచేశారు.