సీఎం సహాయ నిధి అందజేత
అన్నమయ్య: రైల్వేకోడూరు నియోజకవర్గం సత్తుపల్లి గ్రామానికి చెందిన గంధం శెట్టి మల్లేశ్వరమ్మకు ఆదివారం రూ. 39,800 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అందజేశారు. ప్రజలకు అవసరమైన సమయంలో వెంటనే సహాయం అందించడం ప్రభుత్వ ప్రాధాన్యమని, అర్హులైన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చేరేందుకు కృషి కొనసాగుతోందని ఎమ్మెల్యే తెలిపారు.