VIDEO: దేవాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు

VIDEO: దేవాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు

AKP: నర్సీపట్నంలో నూతనంగా నిర్మించిన శ్రీ నూకాలమ్మ దేవాలయంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆదివారం అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులలో భక్తి భావం పెంపొందించే విధంగా ప్రతి ఆదివారం ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా వజ్రగడ గ్రామానికి చెందిన కళాకారులు తమ భక్తి పాటలతో అందరిని అలరించారు.