VIDEO: భక్తులతో కిటకిటలాడిన పుణ్యక్షేత్రం
GDWL: ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి పుణ్యక్షేత్రంలో అమావాస్యను పురస్కరించుకొని ఆంజనేయస్వామి ఆలయం గురువారం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని కృష్ణా నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం ఆలయంలో ఆకుపూజ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే పుష్కర ఘాట్ వద్ద భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు.