మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం చేయూత: MLA
KMM: వైరా నియోజకవర్గంలో స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలకు వడ్డీ లేని రుణాలను వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు మంగళవారం పంపిణీ చేశారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం చేయూతనిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.