కేయూ లో జ్యోతిబా పూలే వర్ధంతి కార్యక్రమం
వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో బహుజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జ్యోతిబా పూలే వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థి నాయకులు పూలే దంపతులు అణగారిన వర్గాల హక్కుల కోసం చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. విద్యను విస్తరించిన మహనీయుడి ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బొట్ల మనోహర్, తదితరులు పాల్గొన్నారు.