'సైబర్ నేరాల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలి'

'సైబర్ నేరాల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలి'

ప్రకాశం: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హనుమంతుని పాడు ఎస్సై కే.మాధవరావు సూచించారు. సోమవారం మండలంలోని హాజీపురం అడ్డ రోడ్డు వద్ద స్థానిక ప్రజలకు సైబర్ నేరాల పట్ల ఎస్సై అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తులు సోషల్ మీడియా గ్రూపులకు పంపే లింక్స్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయవద్దన్నారు. అలా చేస్తే బ్యాంకుల్లో నగదు ఖాళీ అవుతుందన్నారు.