నందవరం వద్ద అదుపు తప్పి బైక్ బోల్తా
NLR: మర్రిపాడు మండలం నెల్లూరు- ముంబై జాతీయ రహదారిపై నందవరం చెరువు కట్ట మార్గం మధ్యలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బైక్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో బైక్ పై ఉన్న యువకుడికి గాయాలయ్యాయి. దీంతో అటుగా వెళుతున్న వాహనదారులు గమనించి గాయపడిన ఆ యువకుడికి చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.