'డాట్ కోర్సు ద్వారా క్షయ వ్యాధిని నివారించవచ్చు'

'డాట్ కోర్సు ద్వారా క్షయ వ్యాధిని నివారించవచ్చు'

W.G: విస్సాకోడేరు జడ్పీ పాఠశాలలోని వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్షయ వ్యాధిపై అవగాహన కల్పించారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని టీబీ సూపర్వైజర్ ఎన్. సుజాత సూచించారు. డాట్ కోర్సు ద్వారా క్షయను పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. వ్యాధి లక్షణాలను ముందే గుర్తించి చికిత్స పొందాలని కోరారు.