'రేపు 66 డివిజన్లలో వార్డు సభలు'
KNR: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక'లో భాగంగా గురువారం నగరంలోని 66 డివిజన్లలో వార్డు సభలు నిర్వహించనున్నట్లు నగరపాలక సంస్థకమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ సభల్లో సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు వెల్లడించడంతో పాటు స్థానిక సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించాలని ఆదేశించారు.