కోవ లక్ష్మి నివాసంలో వినాయక చవితి వేడుకలు

ASF: ఎమ్మెల్యే కోవ లక్ష్మి తమ నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి, అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. MLA మాట్లాడుతూ.. గణపతి ఆశీస్సులతో ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. ప్రతి ఒక్కరు భక్తి శ్రద్దలతో విగ్రహాలను పూజించాలని ఆమె పిలుపునిచ్చారు.