విజయనగరం జిల్లాలో నేడు చికెన్ ధరలు
విజయనగరం జిల్లాలో చికెన్ ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం బ్రాయిలర్ చికెన్ కిలో రూ.200 నుంచి రూ.280 వరకు ఉంది. స్కిన్‌లెస్ చికెన్ రూ.220 నుంచి రూ.300 వరకు, నాటు కోడి రూ.250 నుంచి రూ.350 పైగా విక్రయిస్తున్నారు. డిమాండ్ పెరగడం, సరఫరా తగ్గడం వల్ల ధరలు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.