సీఎం రిలీఫ్ ఫండ్ అందజేత
VSP: విశాఖ జీవీఎంసీ 32వ వార్డుకు చెందిన కె. వెంకట మోహన్ రెడ్డికి వైద్య ఖర్చుల నిమిత్తం మంగళవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు పాల్గొన్నారు.