కొత్తమ్మ తల్లి ఆలయంలో ప్రతిష్ట మహోత్సవాలు

SKLM: కోటబొమ్మాలి మండల కేంద్రంలోని కొత్తమ్మ తల్లి ఆలయంలో ఆదివారం ఉదయం అనిశెట్టి మండప ప్రతిష్ట కార్యక్రమాలను ప్రారంభించారు. ఆలయ ఈవో రాధాకృష్ణ మాట్లాడుతూ.. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలతో ఐదు అంతస్తుల రాజగోపురంతో పాటు అనిశెట్టి మండప విస్తరణ కార్యక్రమాలను చేపడుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమాలు ఈరోజు సాయంత్రం వరకు కొనసాగుతాయని తెలిపారు.