రాళ్ల చెరువు వద్ద స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర
AKP: ఎలమంచిలి పట్టణం రాళ్లచెరువు వద్ద మున్సిపల్ కమిషనర్ ప్రసాదరాజు ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి తుప్పలు తొలగించి శుభ్రం చేశారు. ప్రతి శనివారం ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ ఉద్యోగులు సిబ్బంది శ్రమదానం చేస్తు వ్యర్థాలను తొలగించి శుభ్రం చేస్తున్నామని మున్సిపల్ మేనేజర్ విజయకుమార్ తెలిపారు.