HIT TV ఎఫెక్ట్.. కార్యాలయంపై బోర్డు మారింది !
KMR: నూతన మండలాల ఏర్పాటు జరిగి రెండేళ్లు గడిచినా మొఘ గ్రామ పంచాయతీ కార్యాలయంపై ఇంకా పాత మండలం పేరే దర్శనమిస్తోంది. కొత్త మండలంలో చేరినా.. పాత మండలం పేరే..! అనే శీర్షికతో HIT TVలో కథనం ప్రచురితమైంది. కథనానికి స్పందించిన.. మొఘ పంచాయితీ కార్యదర్శి నందు పాత మండలం పేరును తొలగించి, ప్రస్తుతం ఉన్న డోంగ్లి మండలం పేరును రాయించారు.