కుటుంబ కలహాలతో యువకుడు మృతి
NLR: ఉలవపాడు(మం) చాగొల్లుకు చెందిన వంశీకృష్ణ అనే యువకుడు దక్షిణాఫ్రికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవలే స్వగ్రామానికి వచ్చిన ఆయన డబ్బుల విషయంలో కుటుంబ సభ్యులతో విభేదాలు రావడంతో, గత నెల 21న పురుగుల మందు తాగాడు. గుంటూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. శనివారం మృతిచెందినట్లు ఎస్సై సుబ్బారావు తెలిపారు.