శ్రీవారి సేవలో ప్రముఖులు
TPT: తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ వేమిరెడ్డి దంపతులు, నిర్మాత నాగవంశీ ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ముందుగా వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేసి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.