VIDEO: అయినవిల్లిలో వీధి కుక్కలు స్వైర విహారం
కోనసీమ: అయినవిల్లి మండలంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కె.జగన్నాధపురంలో శుక్రవారం ఉదయం ప్రధాన రహదారిలో వీధి కుక్కలు గుంపుగా చేరి వాకింగ్ చేసే వారిని, పొలాలకు వెళ్లే రైతుల మీదకు వెళ్లడంతో వారు భయభ్రాంతులకు గురయ్యారు. వాహనాలు వెంబడి పరుగెత్తి వెంబడిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.