VIDEO: చేతబడి చేశాడనే అనుమానంతో యువకుడి హత్య

VIDEO: చేతబడి చేశాడనే అనుమానంతో యువకుడి హత్య

BDK: చేతబడి చేశాడనే అనుమానంతో యువకుడిని గ్రామస్తులు హత్య చేసిన ఘటన ఆళ్ళపల్లి మండలం భూసరాయిగూడెంలో గురువారం చోటుచేసుకుంది. ఇటీవల అదే గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక కామెర్లతో మృతి చెందింది. దీనికి కారణం మడకం రాజు అనే యువకుడే అని భావించిన గ్రామస్తులు ఆ బాలిక శవం వద్ద కట్టేసి కొట్టి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.