మాదకద్రవ్యాల పై విద్యార్థులకు అవగాహన

మాదకద్రవ్యాల పై విద్యార్థులకు అవగాహన

VZM: తెర్లాం మండలం పెరుమాళి గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో బుధవారం మాదకద్రవ్యాల వినియోగం ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు బొబ్బిలి డీఎస్పీ భవ్య రెడ్డి ప్రత్యేకంగా విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు వ్యక్తిగత జీవితం, కుటుంబం, సమాజంపై కలిగించే హానికర ఫలితాలపై విద్యార్థులకు వివరించారు.