ఘోర పడవ ప్రమాదం.. 42 మంది గల్లంతు

ఘోర పడవ ప్రమాదం.. 42 మంది గల్లంతు

లిబియా తీరం సమీపంలో వలసదారులతో వెళ్తున్న పడవ ప్రమాదానికి గురైంది. దాదాపు 50 మందితో ప్రయాణిస్తున్న ఈ పడవ బోల్తా పడిన దుర్ఘటనలో 42 మంది వలసదారులు గల్లంతయ్యారు. కేవలం ఏడుగురు మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారిలో 29 మంది సూడాన్ దేశస్తులుగా అక్కడి అధికారులు గుర్తించారు. గల్లంతైన వారి కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.