వైభవంగా నాగేంద్ర స్వామి తిరుణాల మహోత్సవం

వైభవంగా నాగేంద్ర స్వామి తిరుణాల మహోత్సవం

కృష్ణా: కంచికచర్ల పట్టణం పరిధిలోని జుజ్జూరు రోడ్డు శివారులలో కొలువై ఉన్న శ్రీ నాగేంద్ర స్వామి 43వ తిరునాళ్ళు మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ తిరుణాల మహోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని, స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో భక్తులు స్వామి వారికి మొక్కులు తీర్చుకున్నారు.