పేదోళ్ల చెవ్వులలో పూలు పెట్టడానికా మీ స్కీములు: మంత్రి
ELR: పేదోళ్ల చెవుల్లో పువ్వులు పెట్టడానికా మీ బ్యాంక్ స్కీమ్లు అంటూ మంత్రి పార్థసారథి బ్యాంక్ మేనేజర్ని ప్రశ్నించారు. నరసింహారావుపాలెంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన గొర్రెలు మేకల పెంపకం దారుల జీవన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రుణాల గురించి బ్యాంక్ మేనేజర్‌కు మంత్రి ఫోన్ చేశారు. ప్రజలకు హామీలేని రుణాలు ఇస్తున్నారా? లేదా? అని ప్రశ్నించారు.