సర్పంచ్ భార్య.. పెత్తనం భర్తదా?
SRPT: ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్ మహిళా సర్పంచ్ విధుల్లో భర్త జోక్యంపై నిరసన వ్యక్తమవుతోంది. ఇవాళ తహసీల్దార్ అమీన్ సమక్షంలో జరిగిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకి సర్పంచ్ గణితకు బదులు ఆమె భర్త రామనర్సు హాజరుకావడంపై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. మహిళా హక్కులను కాలరాస్తూ.. భర్త పెత్తనం సాగించడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.