ప్రత్యేక రైళ్లు నడపాలని కేంద్ర మంత్రికి లేఖ

KDP: ఒంటిమిట్ట కోదండ రాముని బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక రైళ్లను నిలపాలని ఎంపీ మిథున్‌రెడ్డి కేంద్ర మంత్రికి లేఖ రాశారు. ఈ నెల 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఘనంగా కోదండరాముని బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని, లక్షలాది భక్తులు హాజరవుతారని, భక్తుల సౌకర్యార్ధం రైళ్లను ఒంటిమిట్టలో ఆపాలని రైల్వే మంత్రి ని కోరారు.