VIDEO: ప్రాథమిక విద్యను మెరుగుపరచాలి: ఎంఈవో

VIDEO: ప్రాథమిక విద్యను మెరుగుపరచాలి: ఎంఈవో

SRD: పాఠశాలలో ప్రాథమిక విద్యను మెరుగుపరచాలని ఎంఈవో నాగారం శ్రీనివాస్ అన్నారు. సోమవారం సిర్గాపూర్ మండల సంఘం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలను సందర్శించి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లల అక్షరాభ్యాసం, అభ్యాసన అభివృద్ధిపై ఆయన ఆరా తీశారు. ఈ మేరకు పిల్లలచే పాఠాలు చదివించి ప్రశ్నలు వేశారు. పిల్లలు చక్కగా సమాధానం చెప్పడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.