వీరభద్ర కాలనీలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

MBNR: జిల్లా కేంద్రంలోని వీరన్నపేట వీరభద్ర కాలనీలో సీసీ రోడ్డు పనులను కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా యువ కాంగ్రెస్ పార్టీ నాయకులు లీడర్ రఘు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ముడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ గౌడ్ సహకారంతో కాలనీలో అన్ని అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నామని వెల్లడించారు.