'ఆశా కార్మికులకు పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి'

'ఆశా కార్మికులకు పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి'

ఖమ్మం జిల్లాలో ఆశా కార్యకర్తలకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు, బిల్లులను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు పిన్నింటి రమ్య డిమాండ్ చేశారు. డీఎంహెచ్‌వో రాంబాబుకు వినతిపత్రం అందజేసిన ఆమె.. పీహెచ్‌సీల్లో కొందరికే పారితోషికాలు ఇచ్చి, మిగిలిన వారిని విస్మరించడం సరికాదన్నారు. ఈ నెల 23న 'చలో హైదరాబాద్' నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.