ఆస్పరి ఘటనపై మంత్రి భరత్ దిగ్భ్రాంతి

KRNL: ఆస్పరి మండలం చిగిలిలో విద్యార్థులు మృతి చెందిన ఘటనపై మంత్రి టీజీ భరత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆరుగురు విద్యార్థులు మృతి చెందడం తనను ఎంతగానో కలచివేసిందనన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనపై కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.