VIDEO: 'MLA సమక్షంలో సొంతగూటికి చేరిన నాయకులు'
ADB: నేరడిగొండలోని నాగమల్లెల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు శనివారం ఉదయం కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ నాయకులను బలవంతంగా చేర్చుకుంటున్నారని ఆరోపించారు. ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరించారు.