ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.. ఇద్దరు అరెస్ట్

ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.. ఇద్దరు అరెస్ట్

WGL: నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్-కమ్-కండక్టర్ చీకటి వెంకటయ్యపై దాడి చేసిన ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు. హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ వెళ్తున్న బస్సులో స్టేజీ వద్ద దిగమని సూచించినందుకు దొంతి రాంరెడ్డి, దొంతి లక్ష్మారెడ్డిలు మద్యం మత్తులో దాడికి పాల్పడ్డారు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఎస్సై వివరించారు.