ఒడిశాలో టోర్నడో బీభత్సం.. ఇద్దరు మృతి
ఒడిశాలోని మయూరభంజ్ జిల్లాలో టోర్నడో పెను విధ్వంసం సృష్టించింది. సుమారు 30 నిమిషాల పాటు సాగిన ఈ ప్రకృతి ప్రకోపానికి ఒక మహిళతో సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాలివేగానికి భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు పెకిలించుకుపోవడంతో రవాణా, విద్యుత్ వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి. వందకు పైగా ఇళ్ల పైకప్పులు గాలిలో కిలోమీటర్ల దూరం ఎగిరిపడ్డాయి.