పోక్సో కేసులో వీఆర్ఏ అరెస్ట్

VZM: బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేటకు చెందిన వీఆర్ఏను పోక్సో కేసులో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మండలానికి చెందిన ఓ బాలిక కనిపించడంలేదని మే3న మిస్సింగ్ కేసు నమోదైంది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు బాలికను తీసుకెళ్లిన వీఆర్ఏను పట్టుకున్నారు. బాలికపై లైంగిక దాడి చేసినట్లు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.