అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం సీజ్
NRPT: నారాయణపేట పట్టణంలో టాస్క్ ఫోర్స్, పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా యాద్గిర్ రోడ్డు, బైరం కొండ గ్రామ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. అనంతరం నిందితునిపై కేసు నమోదు చేసి, వాహనాన్ని, 25 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్ల ఎస్సై వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.