రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటన

NLG: దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ శుక్రవారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పీఏపల్లి మండలం అంగడిపేట ఎక్స్ రోడ్ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం, పీఏపల్లిలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో అదనపు గదుల ప్రారంభోత్సవం, కొండమల్లేపల్లి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం, దేవరకొండలో పోషణ్ అభియాన్ కార్యక్రమం, మైనంపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ చేస్తారు.