VIDEO: కొత్తగూడెం డిపోలో నిలిచిపోయిన 66 బస్సులు
BDK: ఆర్టీసీ సమ్మెతో కొత్తగూడెం డిపోలో 66 బస్సులు నిలిచిపోయాయి. బుధవారం కార్మికులు స్వచ్ఛందంగా విధులను బహిష్కరించారు. డిపో ఎదుట ధర్నా చేపట్టిన ఆర్టీసీ జేఏసీ, సీపీఐ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.