'యూరియా సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలి'

KMM: వానాకాలం పంట సాగుకు అవసరమైన యూరియా రైతులకు చేరేలా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం యూరియా, ఎరువుల లభ్యతపై మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు. జిల్లాలో యూరియా కొరత లేదని ఈ సందేశం ఫీల్డ్ లెవల్‌లో వెళ్ళాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు.