విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ట్రాక్టర్.. వ్యక్తి మృతి

E.G: గోకవరం మండలం తిరుమలాయపాలెం గ్రామానికి ఇటుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. దీంతో విద్యుత్ స్తంభం విరిగి ట్రాక్టర్‌లో ఉన్న వ్యక్తిపై పడడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కోరుకొండ మండలం కాపవరం గ్రామానికి చెందిన గొట్టాల శివగా స్థానికులు గుర్తించారు.