క్రెడిట్ స్కోర్ పెరగాలంటే?
క్రెడిట్ స్కోరును పెంచుకునేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. మీరు తీసుకునే బాకీలు ఎప్పటికప్పుడు క్లియర్ చేయాల్సి ఉంటుంది. ప్రతి EMI, క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో చెల్లించాలి. క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో 30శాతం లోపు మాత్రమే ఉండేలా చూసుకోవాలి. కొత్తగా రుణం కోసం దరఖాస్తులు చేయడం తగ్గించాలి. హోమ్ లోన్, గోల్డ్ లోన్ వంటివి తీసుకుని సకాలంలో చెల్లిస్తే క్రెడిట్ స్కోరు మెరుగవుతుంది.