బీఎల్వోలు సర్వేను వేగవంతం చేయాలి: తాసీల్దార్
NTR: కంచికచర్ల మండల పరిషత్ కార్యాలయంలో బీఎల్వోలుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నరసింహారావు పాల్గొని మాట్లాడారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన విధులను బీఎల్వోలు తూచా తప్పకుండా పాటించాలని సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న సర్వేను వేగవంతం చేసి ఖచ్చితమైన వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు.