VIDEO: 'జగన్ హయాంలోనే 75 శాతం పోర్టు పనులు పూర్తి'
SKLM: మూలపేట పోర్టు సందర్శనకు వైసీపీ నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆమదాలవలస నియోజకవర్గ YCP సమన్వయకర్త చింతాడ రవికుమార్ కోరారు. శుక్రవారం స్థానిక వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో 75 శాతం మూల పోర్ట్ పనులు పూర్తి అయ్యాయన్నారు. మిగిలిన పనులు పూర్తి చేయడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు.