VIDEO: 'BJP ఉపాధి హామీ పథకాన్ని తొలగించే కుట్ర చేస్తోంది'
HYD: బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని తొలగించే కుట్ర చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఆమె మాట్లాడుతూ.. కేంద్రంలో BJP అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదల మీద కక్షగట్టినట్లు వ్యవహరిస్తోందని, తెలంగాణలో ఉపాధి హామీ పని దినాలను సగానికి తగ్గించేశారని అన్నారు. తెలంగాణ MPలు, BJP ప్రభుత్వంతో కొట్లాడి ఉపాధి హామీ పథకానికి నిధులు తేవాలన్నారు.